![]() |
![]() |

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -17 లో.....శకుంతల బిర్యాని చేసి ఇంట్లో అందరికి పెడుతుంది. ఆ తర్వాత రుద్ర నిద్రలో ఒక్కసారి ఉల్లిక్కి పడి లేచి పెద్దమ్మ గోరు ముద్దలు అయినా తినే భాగ్యం లేదు.. కనీసం తన వంట అయిన తిందామని అందరు పడుకున్నాక రుద్ర కిందకి వచ్చి.. మిగిలిపోయిన బిర్యానిని తింటుంటాడు. గతంలో వాళ్ళ పెద్దమ్మ శకుంతల తనతో ఎంత ప్రేమగా ఉందో గుర్తు చేసుకొని బాధపడుతాడు.
ఆ తర్వాత కిచెన్ లో ఏదో సౌండ్ వస్తుందని గంగ కిందకి వస్తుంది. రుద్ర బిర్యాని తినడం చూసి ఈయనకి ఏంటి దెయ్యం పట్టిందా ఏంటని అనుకుంటుంది. మరుసటి రోజు గంగ ఉదయం లేచి పూజ చేస్తుంది. శకుంతలకి హారతి ఇవ్వడానికి గంగ వెళ్తుంటే పెద్దసారు ఆపుతాడు. తను అన్నివేళల ఒకేలా ఉండదు గంగ అని అంటుంటే అప్పుడే శకుంతల వచ్చి గంగ ఎవరు తన పేరు భాను కదా అంటుంది. అవును తన పేరు గంగ భవాని కానీ అందరు భాను అంటారని పెద్దసారు అనగానే అందరు తనని బాను అనాలని శకుంతల అంటుంది. పూజ చేసి మంచి పని చేసావని గంగతో శకుంతల అంటుంది. ఇంట్లో అందరిని లేపి మరి గంగ హారతి ఇస్తుంది.
మరొకవైపు గంగ తండ్రి పైడిరాజు దగ్గరికి వీరు మనిషి వచ్చి డబ్బు ఎరగా చూపిస్తాడు. బట్టలు బండి కొనిస్తాడు. నాకూ నీ కూతురు కావాలి.. ఎదురు కట్నం కోటి రూపాయలు ఇస్తానంటాడు. దానికి పైడిరాజు సంతోషంగా ఒప్పుకుంటాడు. తరువాయి భాగంలో మక్కం సూపర్ మార్కెట్ మేనేజర్ రుద్ర దగ్గరికి వస్తాడు. అక్కడ గంగను చూస్తాడు. నేను ఇక్కడ ఉన్నట్టు సర్ కి చెప్పకండి అని గంగ రిక్వెస్ట్ చేస్తుంది. గంగ చున్నీ మొహంపై కప్పుకోని వచ్చి రుద్ర ఇంకా మక్కంకి కాఫీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |